KMM: జిల్లాకు చెందిన గిరిజన యువకుడు బి.మోతి కుమార్ అరుదైన రికార్డు సృష్టించారు. పెనుబల్లి మండలం వి.ఎం.బంజరకు చెందిన ఆయన మైనస్ డిగ్రీల చలిని తట్టుకుంటూ 5,364 మీటర్ల ఎత్తులోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించారు. 5.3 కి.మీ. దూరాన్ని కేవలం 26 గంటల 9 నిమిషాల్లోనే పూర్తి చేసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. త్వరలో ఎవరెస్ట్ శిఖరాన్ని జయించడమే తన లక్ష్యమని అన్నారు.