ప్రకాశం: 2026-27 విద్యా సంవత్సరానికి జిల్లాలోని సంతనూతలపాడు, గణపవరం, అమ్మనబ్రోలు గురుకుల విద్యాలయాల్లో 5, 6, 7, 8 తరగతుల్లో ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ సీవీ రేణుక తెలిపారు. ఒంగోలులోని డీఈఓ కార్యాలయంలో గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కోసం వాల్పోస్టర్ను డీఈఓ రేణుక ఆవిష్కరించారు. ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.