TPT: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ భారీగా పెరిగింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 22 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనం కోసం శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. శనివారం మొత్తం 75,428 మంది శ్రీవారిని దర్శించుకోగా, 36,240 మంది తలనీలాలు సమర్పించారు. అదే రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.56 కోట్లుగా నమోదైంది.