Assembly Meetings : ఏపీ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ అసెంబ్లీ సమావేశా్లో అధికార పార్టీ ఎమ్మెల్యే ఆనం రామ నారాయణ రెడ్డి సొంత పార్టీ నేతలకు ఊహించని షాక్ ఇచ్చారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలో.. ఆనం రామనారాయణ రెడ్డి.. టీడీపీ సభ్యుల వైపు కూర్చున్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ అసెంబ్లీ సమావేశా్లో అధికార పార్టీ ఎమ్మెల్యే ఆనం రామ నారాయణ రెడ్డి సొంత పార్టీ నేతలకు ఊహించని షాక్ ఇచ్చారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలో.. ఆనం రామనారాయణ రెడ్డి.. టీడీపీ సభ్యుల వైపు కూర్చున్నారు. ఓవైపు అధికార వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు కూర్చోగా.. ఆనం మాత్రం టీడీపీ ఎమ్మెల్యేల వైపు కూర్చోవడం హాట్ టాపిక్‌గా మారింది.
గత కొద్దీ రోజులుగా అనం రామనారాయణ రెడ్డి.. వైస్సార్సీపీ ప్రభుత్వం ఫై విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ కార్యక్రమాలపై బహిరంగంగానే విమర్శలు చేశారు. దీంతో పార్టీ అధిష్టానం కూడా ఘాటుగానే స్పందించింది. ఆయన్ను వెంకటగిరి వైసీపీ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించింది.
ఆయన స్థానంలో.. నేదురుమల్లి వారసుడిని నియమించింది. అప్పటినుంచి ఆయన మాటలకు ఇంకా పదును పెరిగింది. ఇదే క్రమంలో ఆనం ..పార్టీ మారబోతారనే వార్తలు ప్రచారం అవుతూ వస్తున్నాయి. ఇక ఈరోజు అసెంబ్లీ లో ఆయన టీడీపీ ఎమ్మెల్యే ల వైపు కూర్చువడం తో త్వరలోనే ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోబోతారని తెలుస్తుంది.