సౌదీ అరేబియా రికార్డు స్థాయిలో మరణశిక్షలు అమలు చేస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు దాదాపు 300 మందికి మరణశిక్ష అమలు చేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా ఇవాళ మరో నలుగురికి ఉరిశిక్ష అమలు చేసినట్లు అధికారిక మీడియా పేర్కొంది. అమ్నెస్టీ ఇంటర్నేషన్ ప్రకారం.. 2023లో చైనా, ఇరాన్ల తర్వాత అత్యధికంగా మరణశిక్షలు అమలు చేసిన దేశంగా సౌదీ అరేబియా నిలిచింది.