కోనసీమ: అయినవిల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు ఐఏఎస్ అధికారి హర్షవర్ధన్ పరిశీలించారు. అనంతరం పలువురు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీకర్, తహసీల్దార్ నాగలక్ష్మమ్మ సిబ్బంది పాల్గొన్నారు.