ADB: నేరడిగొండ మండలంలోని వడ్డూర్ గ్రామంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ SDF నిధుల నుంచి గ్రామానికి 15 ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేసి మంగళవారం రాత్రి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ గజేందర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రవి, శంకర్, మహేందర్, ఉషన్న గ్రామస్తులు తదితరులున్నారు.