»Punjab Education Minister Harjot Singh Bains Ips Officer Jyoti Yadav Will Be Getting Married
Single Life Ends పోలీస్ అధికారిణిని పెళ్లాడనున్న మంత్రి.. ఎప్పుడంటే..?
ఎన్నికల్లో నిలిపిన సామాన్య వ్యక్తులు.. ముఖ్యంగా యువత సీనియర్లను పక్కకు నెట్టేసి ఎమ్మెల్యేలుగా విజయం సాధించి ప్రత్యేకత చాటారు. పంజాబ్ లో ఎన్నికైన వారిలో ఇంకా అవివాహితులు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారు కూడా బ్రహ్మచారులు ఉన్నారు. మరికొందరు బ్రహ్మాచారులుగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా త్వరలో పెళ్లి చేసుకోనున్నారు.
పంజాబ్ ఎన్నికలు బీజేపీకి భారీ షాకిచ్చిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో ఊహించని రీతిలో ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party-AAP) సంచలన విజయం నమోదు చేసింది. ఎన్నికల్లో నిలిపిన సామాన్య వ్యక్తులు.. ముఖ్యంగా యువత సీనియర్లను పక్కకు నెట్టేసి ఎమ్మెల్యేలుగా విజయం సాధించి ప్రత్యేకత చాటారు. పంజాబ్ లో ఎన్నికైన వారిలో ఇంకా అవివాహితులు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారు కూడా బ్రహ్మచారులు ఉన్నారు. ఈ క్రమంలోనే బ్రహ్మచారిగా ఉన్న పంజాబ్ (Punjab) విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బెయిన్స్ (Harjot Singh Bains) త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే ఆయన పెళ్లి చేసుకోబోతున్నది ఎవరినో కాదు ఒక ఐపీఎస్ అధికారిణి కావడం విశేషం. వివరాలు ఇలా ఉన్నాయి.
పంజాబ్ లోని రూప్ నగర్ జిల్లా (Rupnagar District) సాహిబ్ నియోజకవర్గం (Fatehgarh Sahib) నుంచి ఆప్ ఎమ్మెల్యే (MLA)గా హర్జోత్ సింగ్ బెయిన్స్ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 32 ఏళ్ల హర్జోత్ సింగ్ 2014లో చండీగఢ్ లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో బీఏ ఎల్ ఎల్ బీ చేశాడు. 2018లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి అంతర్జాతీయ మానవ హక్కు చట్టంలో ప్రత్యేక కోర్సు చేశాడు. 2017 ఎన్నికల్లో సాహ్నేవాల్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. అనంతరం 2022లో జరిగిన ఎన్నికల్లో గెలిచి ఏకంగా మంత్రి పదవిని పొందాడు.
కాగా అతడు చేసుకోబోయే యువతి పంజాబ్ కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి జ్యోతి యాదవ్ (Jyoti Yadav). ప్రస్తుతం మాన్సా జిల్లా (Mansa District) ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరికీ గతంలో పరిచయం ఉంది. పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు వివాహ బంధంలోకి హర్జోత్ సింగ్, జ్యోతి అడుగుపెట్టనున్నారు. ఇటీవల వీరి నిశ్చితార్థం జరిగిందని సమాచారం. వివాహం చేసుకోబోతున్న ఈ జంటను ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వన్ అభినందించడంతో వీరి పెళ్లి వార్త బహిర్గతమైంది.
కాగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా అధికారంలోకి వచ్చాకే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మన్ గురుప్రీత్ కౌర్ ను సీఎం స్థాయిలో ఉండి వివాహ మాడాడు. కాగా ఆప్ ఎమ్మెల్యేలు నరీందర్ కౌర్ భరాజ్, నరీందర్ పాల్ సింగ్ సహనా కూడా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన అనంతరమే వివాహం చేసుకున్నారు. మరికొందరు బ్రహ్మాచారులుగా ఉన్న ఆప్ ఎమ్మెల్యేలు కూడా త్వరలో పెళ్లి చేసుకోనున్నారు.