ఏలూరు: జిల్లాలో 18 ఏళ్లు నిండిన కార్మికులు వివాహ కానుక, ప్రసూతి ప్రయోజన, సహజ మరణ ఉపశమన, అంత్యక్రియల వ్యయ సహాయ పథకాలకు దరఖాస్తు చేయాలని ఉప కార్మిక డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ శనివారం తెలిపారు. ఇప్పటికే ఈ పథకాలను నమోదు చేసుకున్న కార్మికులు వివరాలను (నవీకరణ) అప్డేడేట్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా లేబర్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.