»Indian Railways Issues New Luggage Rules To Passengers
Railway Luggage Rules: కొత్త రూల్స్ తెచ్చిన రైల్వే..అధిక లగేజీ తీసుకెళ్లేవారికి షాక్
ఇండియన్ రైల్వే(Indian Railway) కొత్త రూల్(Rule)ను తీసుకొచ్చింది. రైళ్లలో ప్రయాణించే వారికి కొత్త లగేజీ రూల్స్(Luggage Rules)ను ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకూ ఉండే నిబంధన ప్రకారంగా రైల్వే ప్రయాణికులు తమతో ఎంత లగేజీనైనా తీసుకెళ్లవచ్చు. కానీ ఇకపై అలా తీసుకెళ్లడానికి వీల్లేదు. ఈ కొత్త విధానాన్ని రైల్వే ప్రకటించింది. అనుమతికి మించి లగేజీ(Luggage)ని తీసుకెళ్లే ప్రయాణికులకు రైల్వే భారీ జరిమానాను విధించనుంది.

విమాన ప్రయాణాల్లో మాదిరిగానే రైళ్ల(Railways)లో కూడా అదనపు లగేజీని తీసుకెళ్లేందుకు ఇకపై ఛార్జీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రైళ్లలో అధిక లగేజీ(Luggage)తో ప్రయాణించవద్దని తెలుపుతూ రైల్వే మంత్రిత్వ శాఖ ట్వీట్(Tweet) చేసింది. ఎక్కువ లగేజీతో వెళ్లేవారు పార్సిల్ ఆఫీసులో కచ్చితంగా లగేజీ బుక్ చేసుకోవాలని రైల్వే శాఖ వెల్లడించింది.
రైళ్లలో ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణించేవారు 70 కిలోల వరకూ లగేజీని తమ వెంట ఫ్రీగా తీసుకెళ్లవచ్చు. సెకండ్ క్లాస్ ఏసీలో అయితే 50 కిలోల వరకూ లగేజీ(Luggage)ని తమ వెంట తీసుకెళ్లొచ్చు. థర్డ్ క్లాస్ ఏసీ స్లీపర్, ఏసీ చైర్ కార్ క్లాస్ లల్లో 40 కిలోలు, సెకండ్ క్లాస్ లో 25 కిలోల వరకూ లగేజీని తీసుకెళ్లవచ్చని రైల్వే శాఖ ప్రకటించింది. అంతకంటే ఎక్కువ లగేజీతో ప్రయాణించేవారు కచ్చితంగా పార్సిల్ ఆఫీసులో సంప్రదించాలని తెలిపింది. రైలు బయల్దేరడానికి కనీసం 30 నిమిషాల ముందు బుకింగ్ చేసుకోవాలని వెల్లడించింది. ఒక వేళ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా అధిక లగేజీ(Luggage)తో ప్రయాణిస్తే బ్యాగేజీ విలువకు ఆరు రెట్లు జరిమానాను చెల్లించాల్సి ఉంటుందని రైల్వే శాఖ హెచ్చరించింది.