గత ఏడాది నేచురల్ స్టార్ నాని నటించిన ‘దసరా’ మూవీతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం అతడు మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఓ కథ చెప్పినట్లు ఫిలింనగర్లో వార్తలు వస్తున్నాయి. ఈ కథ మెగాస్టార్‌కు విపరీతంగా నచ్చేసిందని.. ఆయన ఓకే చెప్పారని సమాచారం. చిరు విశ్వంభర, ది ప్యారడైజ్ సినిమాల తర్వాత ఈ మూవీ భారీ బడ్జెట్‌తో పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.