»Tammareddy Bharadwaja Fires On Criticism Over Rrr
Tammareddy: నోరు విప్పితే అందరి జాతకాలు బయటపడతాయ్..తమ్మారెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ఆర్ఆర్ఆర్(RRR) సినిమా ఆస్కార్(OSCAR) ప్రమోషన్స్ గురించి టాలీవుడ్(Tollywood) సీనియర్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ(Tammareddy Bharadwaja) షాకింగ్ కామెంట్స్ చేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియోపై మెగా బ్రదర్ నాగబాబు(Nagababu), దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు(Raghavendra Rao) స్పందించారు. నాగబాబు అయితే కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.
ఆర్ఆర్ఆర్(RRR) సినిమా ఆస్కార్(OSCAR) ప్రమోషన్స్ గురించి టాలీవుడ్(Tollywood) సీనియర్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ(Tammareddy Bharadwaja) షాకింగ్ కామెంట్స్ చేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియోపై మెగా బ్రదర్ నాగబాబు(Nagababu), దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు(Raghavendra Rao) స్పందించారు. నాగబాబు అయితే కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఆర్ఆర్ఆర్(RRR) సినిమా ప్రమోషన్స్ కోసం రూ.80 కోట్లు ఖర్చు చేశారని, ఆ డబ్బులతో ఓ 8 సినిమాలు చేసేయవచ్చని సీనియర్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
తమ్మారెడ్డి(Tammareddy) వ్యాఖ్యలకు మెగా బ్రదర్ నాగబాబు(Nagababu) స్పందిస్తూ..నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడా రూ.80 కోట్లు అంటూ ఘాటుగా స్పందించారు. దీనిపై మరోసారి తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. గత రెండు రోజుల నుంచి తనపై సోషల్ మీడియా వేదిక వస్తున్నవార్తలపై తమ్మారెడ్డి(Tammareddy) మాట్లాడారు. తాను ఏం మాట్లాడినా ఎవరో ఒకరు ఏదోక విధంగా అంటున్నారని, వాటన్నింటినీ నేను పట్టించుకోనని అన్నారు. తాను ఇండస్ట్రీలో ఎప్పుడూ రెస్పాన్సిబుల్ గానే ఉంటానని, అయితే ఇండస్ట్రీకి చెందిన కొంత మంది పెద్దవాళ్లు తనను వేలెత్తి చూపడం బాలేదన్నారు. వారికి మాటలకు తాను వివరణ ఇవ్వకూడదని అనుకున్నానని, ఎందుకంటే తాను ఏం తప్పు చేయలేదన్నారు. అందుకే తాను ఎవ్వరికీ క్షమాపణలు చెప్పనని తెలిపారు.
ఆర్ఆర్ఆర్(RRR) గురించి గతంలో ప్రశంసిస్తూ మాట్లాడితే దాని గురించి ఎవ్వరూ మాట్లాడ్డం లేదని, ఏదో చిన్న వీడియోలోని మాటలకు తనపై విరుచుకుపడుతున్నారని అన్నారు. మూడు గంటల పాటు జరిగిన సెమినార్ లో భాగంగా ఎక్కువగా చిన్న సినిమాల గురించి మాట్లాడానని, దానికి సంబంధించి చిన్న సినిమాలు తీసేవాళ్లందరూ వచ్చారని తెలిపారు. ఆ సందర్భంగా వారికి చిన్న సినిమాల ప్రభావాలు, ప్రమోషన్స్ గురించి చెప్పానన్నారు. అంతేకానీ ఆర్ఆర్ఆర్(RRR)ని తక్కువ చేసి మాట్లాడలేదన్నారు.
రాజమౌళి(Rajamouli) అంటే తనకు అసూయ అని పలు వార్తలు వచ్చాయని, అదంతా తనపై బురదజల్లే ప్రయత్నాలన్నారు. జెలసీ ఫీలవ్వడానికి తాను ఆయన కాలానికి చెందిన దర్శకుడినైనా అయ్యుండాలని, లేకపోతే ఆయనతో పాటు సమానంగా సినిమాలు తీసేవాడినై ఉండాలని, తానేదో కృష్ణా, రామా అంటూ బతుకుతున్నానని, తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తమ్మారెడ్డి భరద్వాజ(Tammareddy Bharadwaja) తెలిపారు. తాను నోరు విప్పితే అందరి అకౌంట్లు బయటపడతాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం తమ్మారెడ్డి భరద్వాజ మాటలు మరోమారు నెట్టింట వైరల్ అవుతున్నాయి.