TPT: నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. రైల్వే కాలనీలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో నిర్వహించిన ఎగ్జిబిషన్లో విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలు ఆకట్టుకున్నాయి. కమిషనర్ చిన్ననాటి నుంచే పర్యావరణ బాధ్యతను పెంపొందించడం అవసరమని, ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వాములవ్వాలన్నారు.