»Own Home Thieves Are Playing The Role Of Shikandi Former Deputy Cm
Tatikonda Rajaiah : సొంత పార్టీ దొంగలే షికండి పాత్ర పోషిస్తున్నారు : మాజీ డిప్యూటీ సీఎం
తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య(Tatikonda Rajaiah) తీవ్రంగా ఖండించారు. ఇంటి దొంగలే శిఖండిలా మారి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు వస్తున్నాయనే తనపై కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. జరిగిన విషయాలన్ని సీఎం కేసీఆర్ (Cm kcr) దృష్టికి తీసుకెళ్తానని అన్ని విషయాలను వివరిస్తానని రాజయ్య అన్నారు.
తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య(Tatikonda Rajaiah) తీవ్రంగా ఖండించారు. ఇంటి దొంగలే శిఖండిలా మారి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు వస్తున్నాయనే తనపై కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. జరిగిన విషయాలన్ని సీఎం కేసీఆర్ (Cm kcr) దృష్టికి తీసుకెళ్తానని అన్ని విషయాలను వివరిస్తానని రాజయ్య అన్నారు. ఎమెల్యే రాజయ్య పై ఓ మహిళా సర్పంచ్ (Female Sarpanch) సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే తనకు ఫోన్ చేసిన అసభ్యంగా మాట్లాడుతున్నారని.. లైంగికంగా వేధిస్తున్నారని తెలిపింది. అంతేకాకుండా.. అతని అనుచరులతో కూడా ఫోన్లు చేయించి వేధిస్తున్నారని ఆమె వాపోయింది.
హన్మకొండ జిల్లా జానకీపురం మహిళా సర్పంచ్ నవ్య చేసిన ఈ ఆరోపణలు పెను సంచలనంగా మారడంతో.. రాజయ్య ప్రగతి భవన్కు చేరుకున్నారు. ఎమ్మెల్యే రాజయ్య ఫోన్లు చేసిన అసభ్యంగా మాట్లాడుతున్నారని దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయని ఈ విషయాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ (Minister ktr) దృష్టికి తీసుకెళతానని సర్పంచ్ నవ్య కన్నీటిపర్యంతమయ్యారు. ఇటువంటి నేతలతో బీఆర్ఎస్ పార్టీకి (Brs Party) చెడ్డ పేరు వస్తోందని ఇటువంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ నవ్య డిమాండ్ చేశారు. అయితే.. సర్పంచ్ నవ్య వ్యాఖ్యలపై పైవిధంగా తాటికొండ రాజయ్య స్పందించారు.పార్టీ కోసం పని చేసే వాళ్లను వేధిస్తున్నారంటూ జానకీపురం (Janakipuram) సర్పంచ్ నవ్య ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే అడ్డుకుంటున్నారని… అలాంటి వాళ్లే పార్టీకి నష్టం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
నిధులు ఇవ్వకపోవడంతో పార్టీ కోసం పనిచేసే సర్పంచులు ..బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ సర్పంచులు చేస్తున్న అభివృద్ధిని మండల బీఆర్ఎస్ నాయకులు కూడా అడ్డుకుంటున్నారని ఆవేదన (Anguish) వ్యక్తం చేశారు. మహిళా సర్పంచ్ అని కూడా చూడకుండా వేధింపులు..చేసిన పనులకు కూడా బిల్లులు ఇవ్వకుండా అడ్డుకుని ఇబ్బందులు చేస్తున్నారని ఎమ్మెల్యే రాజయ్య అనుచరులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మసాగరం (Dharmasagaram) మండలం వాళ్లు చెప్పినట్లు వింటేనే గ్రామాభివృద్ధికి సహకరిస్తారని….లేదంటే మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు వాళ్లు ఎక్కడికి రమ్మంటే అక్కడికి పోవాలి అంటూ సంచలన ఆరోపణలు చేశారు..