PPM: ఖైదీల పట్ల మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని సబ్ జైలు అధికారులకు అడిషనల్ ఫస్ట్ క్లాస్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ జె. సౌమ్య జోస్ఫిన్ సూచించారు. శనివారం పార్వతీపురం పట్టణంలోని సబ్ జైలును ఆమె ఆకస్మికంగా సందర్శించి సమగ్రంగా తనిఖీ నిర్వహించారు. జైలులో ఖైదీల పరిస్థితులు, సదుపాయాలు మరియు భద్రతా వ్యవస్థలను ఆమె స్వయంగా పరిశీలించారు.