BDK: భద్రాచలం పట్టణంలోని ఏడు పదకుండు అవార్డులో అభివృద్ధి పనులకు శనివారం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు శంకుస్థాపన చేశారు. వారితోపాటు సర్పంచ్ కృష్ణ ఉపసర్పంచ్ కవిత పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. భవిష్యత్తులో కూడా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు.