ఈ ఏడాది ఆరభంలో ‘బంగార్రాజు’ మూవీతో కాస్త అలరించారు నాగార్జున, నాగ చైతన్య. అయితే ఆ తర్వాత మాత్రం అక్కినేని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి. చైతన్య నటించిన ‘థాంక్యూ’, ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అయ్యాయి. దాంతో అక్కినేని ఫ్యాన్స్ ఇటీవల వచ్చిన ‘ది ఘోస్ట్’ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ‘గాడ్ ఫాదర్’కు పోటీగా దసరా బరిలో దిగిన ‘ది ఘోస్ట్’ కూడా తీవ్ర నిరాశకు గురిచేసింది. దాంతో ఇప్పుడు ఆశలన్నీ అఖిల్ పైనే పెట్టుకున్నారు అక్కినేని అభిమానులు.
అఖిల్ కూడా ఇప్పటి వరకు సాలిడ్ హిట్ అందుకోలేదు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’మూవీతో సోసోగానే అనిపించుకున్న అఖిల్.. ఈ సారి స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో కలిసి ‘ఏజెంట్’ మూవీతో మాసివ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. కానీ ఏజెంట్ మాత్రం చాలా రోజులుగా పోస్ట్ పోన్ అవుతునే ఉంది. ఇంకా ఈ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్.. షూటింగ్ స్టేజ్‌లోనే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ‘ది ఘోస్ట్’ రిజల్ట్‌తో.. నాగ్ జడ్జిమెంట్ గాడి తప్పుతోందనే టాక్ నడుస్తోంది.
అందుకే నాగార్జున ‘ఏజెంట్’లో తన ఇన్వాల్వ్మెంట్ తగ్గించాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు ‘ఏజెంట్’లో చాలా మార్పులు చేయించారట నాగ్. కానీ ఇప్పుడు సురేందర్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారని ఇండస్ట్రీ టాక్. కానీ ఏజెంట్ రిలీజ్ డేట్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. మరి అఖిల్‌తో పాటు ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్న ‘ఏజెంట్’ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.