BPT: పిల్లలువారిపాలెంలో అభయ ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ నేత శివప్రసాద్ చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠను నిర్వహించారు. అనంతరం స్వామి వారికి జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో రేపల్లె నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు కొలసాని రాము పాల్గొన్నారు.