HYD: సనత్ నగర్ పరిధిలో టీ పొడి కల్తీ రాకెట్‌ను కమిషనర్ టాస్క్ ఫోర్స్, సనత్ నగర్ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. కల్తీ టీ తయారు చేసి విక్రయిస్తున్న జగన్నాథ్ బిష్ణోయి (33)ను అరెస్ట్ చేశారు. కొబ్బరి తొక్క మిశ్రమం, బెల్లం నీరు, సింథటిక్ రంగులతో నకిలీ టీ తయారు చేసి అసలైనదిగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడిలో 120 కిలోల కల్తీ టీ స్వాధీనం చేసుకున్నారు.