మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫిల్మ్ ‘గాడ్ ఫాదర్’.. బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లతో దూసుకుపోతోంది గాడ్ ఫాదర్. అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఐదు రోజుల్లో 50 కోట్లకు పైగా షేర్ సాధించింది. గ్రాస్ వసూళ్ల ప్రకారం నాలుగు రోజుల్లోనే వంద కోట్లకు పైగా కొల్లగొట్టింది. దాంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు మెగాస్టార్ అండ్ మెగాభిమానులు.
ఇక ఇదే జోష్‌లో మెగా 154 షూటింగ్ చేస్తున్నారు చిరు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వాల్తేర్ వీరయ్య టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమా.. రౌడీ అల్లుడు రేంజ్లో రచ్చ రచ్చ చేసేలా ఉందని చెబుతున్నారు మెగాస్టార్. దాంతో మెగా 154 మెగా కిక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి కొన్ని వర్కింగ్ స్టిల్స్ లీక్ అయ్యాయి.
ఆ స్టిల్స్ భారీ యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించినవిగా ఉన్నాయి. మెగాస్టార్ మాస్ అండ్ స్టైలిష్ లుక్ అదరిపోయేలా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ లీక్డ్ స్టిల్స్ వైరల్‌గా మారాయి. దాంతో మళ్లీ ఇలాంటి లీకులు జరగకుండా.. మెగా 154 టీమ్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. అయితే ఎలాంటి చర్యలు తీసుకున్న.. ఈ మధ్య బడా సినిమాలకు లీకుల గోల మాత్రం తప్పడం లేదు. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.