»Hero Sharwanand Letter Goes To Viral On His Cinema Career
Sharwanand 20 ఏళ్ల సినీ కెరీర్ పై హీరో శర్వానంద్ భావోద్వేగం..
రామ్ చరణ్, ప్రభాస్ తదితరులకు స్నేహితుడు శర్వానంద్. కానీ ఏనాడు వారి పరిచయాలను తన సినిమాల కోసం వినియోగించుకోలేదు. స్వతహాగా ఎదుగుతూ వస్తున్నాడు. తాజాగా నందమూరి బాలకృష్ణ టాక్ షో ‘అన్ స్టాపబుల్’లో సందడి చేశాడు. ఇటీవల శర్వానంద్ పెళ్లి చేసుకుని తన సుదీర్ఘ బ్రహ్మాచారి జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు.
కథలో జీవముంటే ఆ సినిమాను చేసేది ఎవరని ప్రశ్నిస్తే ఎలాంటి ఆలోచన లేకుండా యువ నటుడు శర్వానంద్ (Sharwanand) కనిపిస్తాడు. కథకు ప్రాధాన్యమిచ్చే హీరో (Hero)ల్లో ఒకడు శర్వా. తనను ఎలివేట్ చేసే సినిమా (Movies)ల కన్నా విషయం ఉన్న సినిమాలకు మనోడు ప్రాధాన్యమిస్తాడు. అందుకే అతడు చేసిన సినిమాలు వసూళ్లపరంగా వెనుకంజలో ఉన్నా.. ప్రశంసలపరంగా ముందుంటుంది. మంచి సినిమాలు చేస్తాడు అనే పేరు పొందాడు. అలాంటి శర్వానంద్ సినిమా పరిశ్రమ (Cine Industry)లోకి వచ్చి 20 సంవత్సరాలు గడిచాయి. అందుకే తన రెండు దశాబ్దాల సినీ కెరీర్ ను ఒకసారి శర్వానంద్ నెమరువేసుకున్నాడు. తనకు అండగా నిలిచిన ప్రేక్షకు (Fans)లకు ధన్యవాదాలు తెలిపాడు. ఈ సందర్భంగా ట్విటర్ లో ఒక లేఖ విడుదల చేశాడు. ఆ లేఖ ప్రస్తుతం వైరల్ (Viral)గా మారింది.
లేఖలో ఏముంది అంటే..
‘20 ఏళ్లు ఎన్నో పాత్రలు చేస్తూ, వెండితెరపై అందర్నీ అలరిస్తున్నాను.
భావోద్వేగాలతో నిండిన ఈ ప్రయాణం (Journey)లో 20 సంవత్సరాల స్నేహం, కష్టాలు, ఎత్తులు, లోతులు, చిరునవ్వులు ఎన్నో మరెన్నో.
అచంచలమైన ప్రేమ మరియు మద్దతుతో నా ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు.
ఈ 20 సంవత్సరాలు నా జీవితాన్ని, నా వ్యక్తిత్వాన్ని ద్భుతంగా మలిచాయి.
నా ఈ ‘ఒకే ఒక జీవితం’ సినిమాకి అంకితం. 20 సంవత్సరాల క్రితం ‘శ్రీకారం’ చుట్టిన ఈ సినీ ‘ప్రస్థానం’ మరుపురానిది, మరువలేనిది. ఈ సినీ లోకంలో నా ‘గమ్యం’ ఎంతో దూరం. మిమ్మల్ని అలరించడం కోసం ప్రతి క్షణం ‘రన్ రాజా రన్’ లా పరుగులు తీస్తూనే ఉంటాను. కృషి చేస్తూనే ఉంటాను. ‘శతమానం భవతి’ అంటూ మీరు నాకు ఇచ్చే ఆశీస్సులతో ఇది సాధ్యమవుతుందని నేను నమ్ముతున్నాను.
మీ
శర్వానంద్ ’ అంటూ శర్వా తెలిపాడు.
2004లో వచ్చిన ‘గౌరి (Gowri)’ సినిమాతో శర్వానంద్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. అతడి చివరి చిత్రం ‘ఒకే ఒక నా జీవితం (Oke Oka Jeevitham)’. కాలానికి సంబంధించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. ప్రస్తుతం శ్రీరామ్ (Sree Ram) దర్శకత్వం (Direction)లో శర్వా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం విదేశాల్లో కొనసాగుతుంది. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన శర్వానంద్ అనంతరం హీరోగా ఎదిగాడు. ‘శంకర్ దాదా ఎంబీబీఎస్ (Shankar Dada MBBS)’ సినిమాలో చిరంజీవి సరసన మెరిశాడు. సినీ పరిశ్రమలో చాలా మందితో మంచి అనుబంధం ఉంది. రామ్ చరణ్, ప్రభాస్ తదితరులకు స్నేహితుడు శర్వానంద్. కానీ ఏనాడు వారి పరిచయాలను తన సినిమాల కోసం వినియోగించుకోలేదు. స్వతహాగా ఎదుగుతూ వస్తున్నాడు. తాజాగా నందమూరి బాలకృష్ణ టాక్ షో ‘అన్ స్టాపబుల్’లో సందడి చేశాడు. ఇటీవల శర్వానంద్ పెళ్లి చేసుకుని తన సుదీర్ఘ బ్రహ్మాచారి జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు.