టాలీవుడ్ అందాల భామ మీనాక్షి చౌదరి బాలీవుడ్ ఆఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. హిందీ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన ఆమె నటించనున్నట్లు సమాచారం. 2006లో వచ్చిన అక్షయ్ సూపర్ హిట్ కామెడీ థ్రిల్లర్ ‘భాగమ్ భాగ్’ సీక్వెల్లో ఆమెను కథానాయికగా ఎంపిక చేసినట్లు బాలీవుడ్ వర్గాల టాక్. ప్రస్తుతం ఆమె నాగచైతన్య ‘వృషకర్మ’ చిత్రంలో బిజీగా ఉంది.