»Was Shocked When Raghuvaran Told About Pawan Kalyan Rohini
Rohini: పవన్ గురించి అలా చెప్పగానే షాక్ అయ్యా: రోహిణి
రోహిణి(Rohini) ఎప్పుడూ సినీ విషయాలను చెబుతూ ఉంటారు. కానీ ఈసారి తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను తెలిపారు. ముఖ్యంగా తన భర్త రఘువరన్(Raghuvaran) గురించి ఇది వరకూ ఏ ఈవెంట్లలోనూ, టీవీ షోలలోనూ చెప్పలేదు. తాజాగా తన భర్త రఘువరన్ తనతో పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన మాటలను రోహిణి(Rohini) గుర్తు చేసుకున్నారు.
చైల్డ్ ఆర్టిస్టు(Child Artist)గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నవారు చాలా మంది ఉన్నారు. అందులో యాక్టర్ రోహిణి(Rohini) కూడా ఒకరు. డబ్బింగ్ ఆర్టిస్టుగా, హీరోయిన్ గా కొన్ని వందల సినిమాల్లో ఆమె పనిచేశారు. ప్రస్తుతం ఆమె స్టార్ హీరోలకు తల్లి(Mother character)గా నటిస్తూ వస్తున్నారు. గతంలో ఆమె డబ్బింగ్ ఆర్టిస్టుగా మంచి ఆదరణ పొందారు. ఇప్పుడు స్టార్ హీరోలకు తల్లిగా నటిస్తూ సినీ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.
తాజాగా ఆమె తన వ్యక్తిగత విషయాలను ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. రోహిణి(Rohini) ఎప్పుడూ సినీ విషయాలను చెబుతూ ఉంటారు. కానీ ఈసారి తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను తెలిపారు. ముఖ్యంగా తన భర్త రఘువరన్(Raghuvaran) గురించి ఇది వరకూ ఏ ఈవెంట్లలోనూ, టీవీ షోలలోనూ చెప్పలేదు. తాజాగా తన భర్త రఘువరన్ తనతో పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన మాటలను రోహిణి(Rohini) గుర్తు చేసుకున్నారు.
రఘువరన్(Raghuvaran) చాలా సైలెంట్ అని, తామిద్దరం విడిపోయిన తర్వాత ఆయన చనిపోయారన్నారు. తమకు పెళ్లైన కొత్తలో రఘువరన్ కు మొదటి ప్రాజెక్టు సుస్వాగతం సినిమా అని, షూటింగ్ అయ్యాక ఆయన ఇంటికొచ్చి పవన్ గురించి మాట్లాడారని అన్నారు. పవన్ కళ్యాణ్(Pawan kalyan)లో ఏదో విషయం ఉందని రఘువరన్(Raghuvaran) చెప్పేవారన్నారు. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని, పవన్ షూటింగ్ స్పాట్ కు రాగానే రఘువరన్(Raghuvaran)తో ఎక్కువ సమయం మాట్లాడేవారని తెలిపింది.
ఒకసారి పవన్(Pawan) కనిపించినప్పుడు తన భర్త రఘువరన్(Raghuvaran) అన్న మాటలు ఆయనకు చెప్పానని, అందుకు పవన్ చాలా ఆనందపడ్డారన్నారు. నిజంగా అలా అన్నారా అంటూ ఆసక్తిగా తన మాటలు విన్నారని యాక్టర్ రోహిణి(Rohini) తెలిపింది. పవన్(Pawan) సైలెంట్ గా ఉంటూ కష్టపడే రకం అన్నారు. ఒక పాత్ర కోసం ఫ్లెష్ అండ్ బ్లడ్ ను తీసుకురావడం పవన్ లో చూశానని రోహిణి(Rohini) అన్నారు. ఆయన ఏది చేసినా కొత్తదనం ఉండేలా చేస్తారన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్(Pawan kalyan) గురించి రోహిణి(Rohini) వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.