Chaitanya Krishna: నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ
నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Ramarao) కుటుంబం నుంచి టాలీవుడ్(Tollywood)కి మరో హీరో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకూ చాలా మంది హీరోలు వచ్చారు. బాలకృష్ణ(Balakrishna), హరికృష్ణ హీరోలుగా వచ్చాక వారి తనయులు కల్యాణ్ రామ్, ఎన్టీఆర్(NTR), తారకరత్న(Tarakaratna) హీరోలుగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. తాజాగా ఆ జాబితాలోకి మరో హీరో ఎంట్రీ ఇచ్చాడు. ఎన్టీఆర్ పెద్ద కొడుకు జయకృష్ణ కుమారుడు అయిన నందమూరి చైతన్య(Nandamuri Chaitanya) హీరోగా వెండితెరపై కనిపించనున్నారు.

గతంలో జయకృష్ణ బసవతారకరామ క్రియేషన్స్(Basavatarakarama Creations) పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ నిర్మాణ సంస్థ నుంచి తన కుమారుడిని హీరోగా పరిచయం చేయనున్నాడు. గతంలో రక్ష, జక్కన్న వంటి సినిమాలు తెరకెక్కించిన వంశీకృష్ణ ఆకెళ్ల ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించి ఇది వరకూ ఫస్ట్ లుక్ పోస్టర్(First Look Poster) ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ను చిత్ర యూనిట్(Movie Unit) ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను మార్చి 5వ తేదిని ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
2003లోనే చైతన్య కృష్ణ(Chaitanya Krishna) తెలుగు రిలీజ్ అయిన ‘ధమ్’ అనే సినిమాలో కనిపించారు. జగపతి బాబు, సోనియా అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఆ మూవీలో చైతన్య కృష్ణ కీ రోల్ చేశాడు. ఆ తర్వాత వ్యాపారంలో బిజీ అవ్వడంతో 20 ఏళ్ల తర్వాత హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. గతంలో బాలకృష్ణ(Balakrishna) ఆశీర్వాదంతో ఈ సినిమా ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ మూవీకి సంబంధించిన ఏ అప్ డేట్ రాలేదు. తాజాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ డేట్(Title Announcement Date)ను చిత్ర యూనిట్ ప్రకటించింది.