NZB: భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలో నేటి నుంచి 10వ తేదీ వరకు వార్డు సభలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక సమస్యల పరిష్కారం, వార్డుల అభివృద్ధిపై ఈ సభల్లో చర్చిస్తామన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వార్డుల వారీగా ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఈ సభలను విజయవంతం చేయాలని అధికారులు కోరారు.