ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో మట్కా నిర్వహిస్తున్న రవీందర్‌ను బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సునిల్ కుమార్ తెలిపారు. అనంతరం ఆయనను పోలీస్ స్టేషను తరలించి కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుని వద్ద నుంచి ఒక సెల్ ఫోన్‌తో పాటు రూ. 10,140 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.