ASR: స్మార్ట్ ఫోన్లు ఉన్నవారు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కొయ్యూరు సీఐ బీ.శ్రీనివాసరావు, ఎస్సై పీ.కిషోర్ వర్మ ప్రజలకు సూచించారు. బుధవారం రాత్రి సిబ్బందితో కలిసి బూదరాళ్ల గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఆన్లైన్ మోసాలు పెరుగుతున్నాయన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపిన మెసేజ్లపై క్లిక్ చేయవద్దన్నారు.