ప్రకాశం: ఒంగోలులోని జిల్లా జైలు ఎదురుగా ఉన్న సాయి టవర్స్ అపార్ట్మెంట్లో బుధవారం రాత్రి అల్లరి ఈశ్వరమ్మ అనే మహిళకు మంటలు అంటుకున్నాయి. ఆమె బుధవారం రాత్రి11 గంటల సమయంలో దీపాలతో( కాంతి జ్వాల ) పూజ చేస్తుండగా గమనించకపోవడంతో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్చారు.