MNCL: అడవులు, వన్యప్రాణుల రక్షణలో మీడియా సహకార అందించాలని జన్నారం అటవీశాఖ ఎఫ్డీవో రామ్మోహన్ అన్నారు. జన్నారం, దండేపల్లి మండలాలకు చెందిన మీడియా ప్రతినిధులను వనదర్శిని పేరుతో గురువారం క్షేత్ర పర్యటనకు తీసుకువెళ్లి అడవులపై అవగాహన కల్పించారు. మీడియా పాత్ర కీలకమైందని, అడవులు, వన్యప్రాణుల సంరక్షణపై ప్రజలలో చైతన్యం తీసుకురావాలని మీడియా ప్రతినిధులను ఆయన కోరారు.