ADB: విద్యార్థులు చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం రాత్రి కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 2014వ ర్యాంకు సాధించిన ముండే ఓంప్రకాష్‌ను కలెక్టర్ శాలువాతో సత్కరించి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆకాంక్షించారు.