KDP: ప్రజల రెవెన్యూ సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం “ఒక నెల ఒక నియోజకవర్గం -నాలుగు సందర్శనలు” కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా జూన్ 5వ తేదీన బద్వేల్ శ్రీ రాఘవేంద్ర గ్రాండ్ కళ్యాణ మండపంలో మొదటి సందర్శన జరగనుంది. ఆర్డీఆర్, భూ వివాదాలు తదితర సమస్యలపై ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని RDO ఏ. చంద్రమోహన్ కోరారు.