భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) దాదాపు 100 టన్నుల బంగారాన్ని విక్రయించినట్లు బ్లూమ్బర్గ్ ఒక కథనాన్ని ప్రచురించింది. తాజాగా దీనిపై RBI స్పందిస్తూ.. ఆ కథనాల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఆర్బీఐ వద్ద ఉన్న 880.52 టన్నుల బంగారు నిల్వలు సురక్షితంగా ఉన్నాయని పేర్కొంది.