SRCL: ఈ నెల 5న చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం జన్మదినం సందర్భంగా బోయినపల్లి మండల యూత్ కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షుడు నాగుల వంశీ గౌడ్ ఎమ్మెల్యేపై ప్రత్యేక పాటను రూపొందించారు. ఈ సందర్భంగా రూపొందించిన గేయాల సీడీని బుధవారం కరీంనగర్లోని ఎమ్మెల్యే నివాసంలో మేడిపల్లి సత్యం చేతుల మీదుగా అవిష్కరింపజేశారు.