NLG: నాగార్జున సాగర్ జలాశయంలో నీటిమట్టం 519.90 అడుగులకు పడిపోయి డెడ్ స్టోరేజీకి చేరువవుతోంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 149.09 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. కుడికాల్వకు 7,033 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 900 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోందని నాగార్జునసాగర్ ప్రాజెక్టు అధికారులు తెలిపారు.