MNCL: బెల్లంపల్లి సింగరేణి ఏరియా నూతన జనరల్ మేనేజర్‌గా ఎం. శ్రీ రమేష్ బుధవారం భాద్యతలు స్వీకరించారు. మణుగూర్ ఏరియా నుంచి బదిలీపై వచ్చిన ఆయనకు బెల్లంపల్లి ఏరియా అధికారులు స్వాగతం పలికారు. శాలువాతో సన్మానించి పూల మొక్కలను బహుకరించారు. GM మాట్లాడుతూ.. గతంలో ఈ ఏరియాలో పనిచేసిన అనుభవం ఉందన్నారు. ఏరియాలోని ప్రతి విభాగాన్ని, గనులను సందర్శించనున్నట్లు తెలిపారు.