MLG: మల్లంపల్లి మండలం మంచినీళ్లపల్లి ఎంపీపీఎస్‌లో బుధవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ల్యాద శ్యామరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతోందన్నారు. గురుకుల ప్రవేశ పరీక్షలో సీట్లు సాధించిన విద్యార్థులను సన్మానించి ప్రోత్సాహక సహాయం అందించారు. గ్రామంలోని పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలన్నారు.