KNR: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపునకు ఈనెల 19 వరకు ‘బడిబాట’ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు DEO ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. గ్రామసభలు, ర్యాలీలు, తల్లిదండ్రుల సమావేశాలు, బడిబయట పిల్లల గుర్తింపు, ప్రత్యేక చేరికల డ్రైవ్‌లు చేపట్టనున్నారు. ప్రభుత్వ విద్యా సదుపాయాలపై ప్రజల్లో అవగాహన కల్పించి ప్రతి చిన్నారిని పాఠశాలలో చేర్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు.