SS: పెనుకొండ మండలం మావటూరు పంచాయతీకి చెందిన వైసీపీ కార్యకర్త శంకర్ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ భర్త చరణ్ రెడ్డి బుధవారం ఆయన స్వగృహానికి వెళ్లి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శంకర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.