ADB: నేరడిగొండ మండలంలోని తేజపూర్ గ్రామంలో బోథ్ MLA అనిల్ జాదవ్ బుధవారం పర్యటించారు. గ్రామానికి చెందిన గడ్డం రమణ రెడ్డి తల్లి ఇటీవల అనారోగ్యంతో మరణించింది. విషయం తెలుసుకున్న MLA అనిల్ జాదవ్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నవీన్, శ్రీకాంత్ రెడ్డి, పద్మనాభ రెడ్డి, శోభన్ రెడ్డి తదితరులు ఉన్నారు.