TG: ఉద్యమాలను కాంగ్రెస్ అణిచివేసిందని, తెలంగాణ కథలో నంబర్ 1 విలన్ కాంగ్రెస్సే అని KTR ఆరోపించారు. 1969 ఉద్యమంలో 379 మందిని, మలిదశ ఉద్యమంలో వేలాది మంది ప్రాణాలను బలిగొన్నదన్నారు. KCR పోరాటం, దీక్ష లేకపోతే.. స్వరాష్ట్రం సాకారమయ్యేది కాదన్నారు. ఎత్తిన జెండా దింపితే రాళ్లతో కొట్టి చంపండని చెప్పిన వ్యక్తి అని గుర్తుచేశారు. KCR చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పిన ఏకైక నేత అన్నారు.