VZM: గ్రామాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని పోలీస్ శాఖ నిర్వహిస్తుందని రేగడి పోలీసు స్టేషను SI బాలకృష్ణ అన్నారు. మంగళవారం రాత్రి స్థానిక నిక పూర్లి గ్రామంలో ఆయన పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించి గ్రామ పెద్దలు గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. గృహహింస, శాంతి భద్రత, సైబర్ నేరాలు, మహిళల భద్రత, దొంగతనాలు, ఇతర అంశాలపై ఆవగాహన కల్పించారు.