బొబ్బర్లలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కండరాల నిర్మాణానికి సహాయపడతాయి. పీచుపదార్థం అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్యలను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారంగా పనిచేస్తాయి. బొబ్బర్లలో కొలెస్ట్రాల్ శాతం తక్కువ. రక్తపోటును అదుపులో ఉంచి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో రక్తం వృద్ధి చెందుతుంది.