VZM: చీపురుపల్లి సబ్‌డివిజన్ పరిధిలో ఈనెల 30 వరకు సెక్షన్ 30 అమలులో ఉంటుందని DSP రాఘవులు మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ సమయంలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ర్యాలీలు, ధర్నాలు, ఊరేగింపులు, బహిరంగ సమావేశాల నిర్వహణకు SDPO నుంచి ముందస్తు రాతపూర్వక అనుమతి పొందాలని సూచించారు. మతపరమైన, వివాహ, అంత్యక్రియల కార్యక్రమాలకు ఈ ఉత్తర్వులు వర్తించవన్నారు.