PPM: మక్కువ మండలం పాత గైశిల గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు బుధవారం ఉదయం తెలిపారు. గ్రామాల సమీపంలో గజరాజులు తిరుగుతుండటంతో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏనుగుల కదలికలను ట్రాకర్లు నిరంతరం గమనిస్తున్నారని, వాటిని రెచ్చగొట్టే చర్యలకు దూరంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు కోరారు.