పరిఘాసనం (గేట్ పోజ్’ లేదా ‘గేట్ భంగిమ) అనేది మోకాళ్లపై ఉండి చేసే ఒక పార్శ్వ సాగదీత యోగాసనం. ఇది శరీరాన్ని పక్కలకు వంచడం ద్వారా బలం, వశ్యతను పెంచుతుంది. నడుముకు ఇరువైపులా పేరుకుపోయిన కొవ్వును కరిగించి, నడుమును ఆకర్షణీయమైన ఆకారంలోకి తీసుకురావడానికి అద్భుతంగా పనిచేస్తుంది. వెన్నుపామును నిటారుగా ఉంచి, వెన్ను కండరాలను బలంగా మారుస్తుంది. నడుము నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.