NGKL: కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామానికి చెందిన సభావత్ చరణ్ కుమార్ హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో సీటు సాధించడంతో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆయనను ఘనంగా సన్మానించారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన చరణ్ కుమార్ను అభినందిస్తూ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.