KRNL: నగరపాలక సంస్థకు చెందిన ఖాళీ షాపులకు వెంటనే వేలంపాటలు నిర్వహించాలని కమిషనర్ చల్లా ఓబులేసు అధికారులను ఆదేశించారు. ఇవాళ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లను పరిశీలించిన ఆయన, 25 ఏళ్ల లీజు కాలం పూర్తైన షాపులను తిరిగి వేలం వేయాలని సూచించారు. షాపుల ఎదుట ఉన్న ఆక్రమణలను తొలగించడంతో పాటు, అద్దె బకాయిలు చెల్లించని లీజుదారుల షాపులను సీజ్ చేయాలని ఆదేశించారు.