KNR: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చొప్పదండి బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగుర వేసి ఘనంగా నిర్వహించారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఉద్యమ స్ఫూర్తితో అమరుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆకాంక్షించారు. జిల్లా కార్యదర్శి చేపూరి సత్యనారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి చల్లా అనూష్ పాల్గొన్నారు.