TG: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. పరేడ్ గ్రౌండ్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి, వందనం స్వీకరించారు. అంతకుముందు కలెక్టర్ గరిమ అగర్వాల్‌తో కలిసి ఆయన అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. వేడుకల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు.