CTR: జాగ్రత్త వహిస్తూ దోమల నుంచి కాపాడుకుందామని మలేరియా సబ్ డివిజన్ అధికారి గంగయ్య పేర్కొన్నారు. మలేరియా వ్యతిరేక మాసోత్సవాలలో భాగంగా మంగళవారం పుంగనూరు అర్బన్ PHC పరిధిలో వైద్యశాఖ సిబ్బందితో కలిసి పురవీధుల ర్యాలీ చేపట్టారు. దోమలు కుడితే వ్యాపించే వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈనెల 30వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు.